LET'S HELP ANJI
  • Image field 62
  • మన తోటి ఫొటోగ్రాఫర్ అంజి ని ఆదుకుందాం

  • ఆత్మీయ ఫోటోగ్రఫీ సోదరులకు నమస్కారం,

    TPVPA స్వరక్ష పరివార్ నుండి రెండవ పిలుపు, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన, ఫోటోగ్రఫి అసోసియేషన్ నిర్వహించిన క్రికెట్ పోటీలో ఎంతో ఉల్లాసంగా పాల్గొని సిక్సర్లు బాధే మల్లాపూర్ , హైదరాబాద్ కి చెందిన మన మిత్రుడు (SVP ఫోటోగ్రఫి) అంజికి 2020 కోవిడ్ సమయంలో యాక్సిడెంట్ జరిగి ఒక చెయ్యి ఒక కాలు సరిగ్గా పనిచేయటం లేదు. చావుతొ పోరాడి గెలిచిన అంజి ఇప్పుడు బతుకుతెరువు కోసం పోరాడుతున్నాడు. ఎంతో కర్చుతో నిత్యం ఫిజియోతెరపి చేసుకుంటూ ఇంకా మందులు వాడుతున్నాడు.

     ఈ క్లిష్టమైన సమయంలో అంజి కి సహాయం చేయడానికి చేతులు కలుపుదాం రండి. ప్రతి చిన్న సహకారం అతని ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరియు అతనికి ఆత్మస్థైర్యం నింపడానికి దోహద పదుతుందని ఆశిస్తున్నాం.
    తన ఆరోగ్యాన్ని తిరిగి పొందాలని మరియు మళ్ళీ పని చేసుకునే పరిస్థితికి రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మనవంతు సహకారం అందిద్దాం.

    మీరు సహకారం అందించే ప్రతి రూపాయి లెక్క పారదర్శకంగా మీ తెలియజేయడం TPVPA స్వరక్ష పరివార్ ప్రత్యేకత.

    గమనిక: 2.5% లావాదేవీ  మరియు 1% వెబ్సైటు నిర్వహణ చార్జీలు వర్తిస్తాయి. మొత్తం వచ్చిన ఫండ్ నుండి ఈ రుసుము వసూలు చేయబడును.

     ఇట్లు,
    స్వరక్ష పరివార్ కమిటీ,
    తెలంగాణ ఫోటో & విడియో గ్రాఫర్స్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ (TPVPA)

  • prevnext( X )
    INR
  • FOR ANY TECHNICAL QUERIES FEEL FREE TO CONTACT 9849117209

  • Should be Empty: